Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-May-2016 13:43:10
facebook Twitter Googleplus
Photo

హీరోకి విలన్ కానీ... హీరోయిన్ అయిన అనుష్కకి విలన్ దొరకడమేంటి అంటారా? అనుష్క కేవలం హీరోయిన్ మాత్రమే కాదు హీరోల తరహాలో ఆమె పవర్ ఫుల్ వుమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తోంది. అలాంటప్పుడు ఆమె సినిమాలకీ ఓ పవర్ ఫుల్ విలన్ ని ఎంపిక చేయాల్సిందే కదా! ప్రస్తుతం అనుష్క చేస్తున్న భాగ్ మతి సినిమా కోసం కూడా అలా ఓ పవర్ ఫుల్ విలన్ ని ఎంపిక చేశారు. మలయాళం యాక్టర్ జయరామ్ ని ఆ పాత్రకోసం తీసుకున్నారు. ఆయనకోసం ఓ ప్రత్యేకమైన గెటప్ ని కూడా సిద్ధం చేశారు. ఆ గెటప్ తో కూడిన ఫొటోల్ని స్వయంగా బయట పెట్టాడు జయరామ్. మలయాళంకి చెందిన జయరామ్ తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే కనిపించే ఆయన ఈసారి అనుష్క కోసం పవర్ ఫుల్ విలన్ గా మారబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి తెలుగు చిత్రం `భాగ్ మతి`నే.

ఇదివరకు తుపాకిలో విజయ్ పై అధికారిగా నటించి కామెడీ పంచాడు. అనుష్క సినిమాలో అందుకు భిన్నమైన పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడన్నమాట. పిల్లజమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం భాగ్మతి. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుండగా ప్రభాస్ ఓ అతిథి పాత్రలో నటిస్తాడని ప్రచారం సాగుతోంది. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ సినిమా కోసం అనుష్క పెద్దయెత్తున కాల్షీట్లు కేటాయించింది. మొదట అందరూ చారిత్రాత్మక కథ అనుకొన్నారు కానీ ఇది నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా సాగే సినిమా అని చిత్రబృందం చెబుతోంది.

,  ,  ,  ,  ,  ,  ,