Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Aug-2017 13:00:38
facebook Twitter Googleplus
Photo

అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లు చించేస్తూ కనిపిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును ఉద్దేశించి.. తాతయ్యా.. చిల్ అంటూ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే హాట్ టాపిక్ అవుతుంటే.. ‘అర్జున్ రెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్లో సైతం విజయ్ అండ్ కో వీహెచ్ మీద కౌంటర్లు వేయడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తన ప్రసంగం సందర్భంగా పదే పదే ఎఫ్ వర్డ్స్ వాడటం.. ప్రేక్షకులతో బూతులు మాటలు మాట్లాడించడం.. ఇంకా చాలానే అతి చేసి షాకిచ్చాడు విజయ్. తన సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ.. మరీ ఈ స్థాయిలో అతను యాటిట్యూడ్ చూపించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.

అది చాలదన్నట్లు విజయ్ తో సినిమా చేస్తున్న నందిని రెడ్డి.. వేదిక మీదికి వచ్చినపుడు వీహెచ్ ను ఉద్దేశించి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించినపుడు అతను ఇచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. తాతయ్యా చిల్.. అంటే నీ ఉద్దేశమేంటి అని అడిగితే.. ఈ వయసులో ఇవన్నీ ఎందుకు ఊరికే ఉండక. గొడవలెందుకు.. ప్రేమిద్దాం. రోడ్డు మీదికొచ్చి పోస్టర్లు చించడమేంటి అన్నట్లుగా ఆ మెసేజ్ పెట్టానని విజయ్ కౌంటర్ వేయడం విశేషం. ఇదంతా ఎందుకు వీహెచ్ గారికి సినిమా చూపించొచ్చు కదా అని నందిని అంటే.. పోస్టరే తట్టుకోలేకపోతే ఇక సినిమా గాని అసలు అన్నాడు విజయ్.

,  ,  ,  ,