Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Aug-2015 14:45:37
facebook Twitter Googleplus
Photo

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ 25వ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు బీవీఎస్ఎన్‌ ప్రసాద్. అంతే సీరియస్‌గా వర్క్‌ చేస్తున్నారు డైరెక్టర్‌ సుకుమార్.1 ? నేనొక్కడినేతో ప్రేక్ష‌కుల‌ను నిరాశపరిచిన సుకుమార్‌ ఎన్టీఆర్‌ 25వ చిత్రం విషయంలో మాత్రం ఎందులోనూ రాజీ పడట్లేదు. అందుకే..లండన్‌లోనే ఎక్కువ భాగం షూటింగ్‌ ప్లాన్ చేసి, తాజాగా అక్క‌డే ఓ అపార్ట్‌మెంట్‌లో ఆఫీస్ సెట్ వేయించి, జగపతిబాబు ? ఎన్టీఆర్‌ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.ఆర్ట్ డైర‌క్ట‌ర్ ర‌వీంద‌ర్ నేతృత్వంలో 60ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఈ సెట్ రూపుదిద్దుకుంది.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగుండ‌డంతో ఆనందం వ్య‌క్తంచేస్తున్నారు నిర్మాత‌. నైజాం, కృష్ణా ఏరియాల నుంచి బ‌య‌ర్స్ భారీ ఆఫ‌ర్స్ ఇస్తున్నారు.ఈ మూవీకి నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ఖరారు చేశాని సమాచారం.ఎన్టీఆర్ కూడా మంచి కేర్ తీసుకుంటున్నాడు. బిజినెస్ వ్యవ‌హారాల‌ను సైతం చూసుకుంటున్నాడ‌ని, విడుద‌ల హ‌క్కుల అమ్మ‌కంలో అప్పుడే తొంద‌ర‌ప‌డ‌వ‌ద్ద‌ని నిర్మాత‌కు స‌ల‌హా ఇస్తున్నా డు.త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఐట‌మ్ సాంగ్ కూడా తెర‌కెక్క‌నుంది.సుక్కూ గ‌త చిత్రాల మాదిరిగానే ఈ ప్ర‌త్యేక గీతం కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచిపోనుంది.

,  ,  ,