Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jun-2015 17:38:11
facebook Twitter Googleplus
Photo

ఫిక్సింగ్ మచ్చతో క్రికెట్ నుంచి వైదొలగిన క్రికెటర్ శ్రీశాంత్ ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి విదితమే. ముఖ్యంగా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి ఇతనితో ఇటీవలే ఓ చిత్రాన్ని ప్రకటించాడు. క్రికెట్ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్ర కోసం టాప్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం కాజల్ అగర్వాల్, తమన్నాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, వీరు పారితోషికం బాగా ఎక్కువగా అడుగుతున్నారట. ఏమైనా కథానాయిక ఎవరన్నది త్వరలోనే తేలిపోతుంది!

,  ,  ,