Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 13:09:14
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొన్ని రోజుల క్రితం బాగా హర్ట్ అయిన విషయం తెలిసిందే. సైమా 2016 అవార్డుల్లో.. ఎన్టీఆర్ ను కనీసం బెస్ట్ యాక్టర్ గా నామినేషన్ గా కూడా లభించకపోవడం.. అభిమానులనే కాదు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టెంపర్ చిత్రానికి గాను ఎన్టీఆర్ నామినేట్ చేయకపోవడంపై ఓపెన్ గానే విమర్శలకు దిగారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పుడు వారికి ఓ సంతోషకరమైన వార్తను ఫిలింఫేర్ వినిపించింది.

ఏటా అందించే ఫిలింఫేర్ అవార్డులకుగాను నామినేషన్స్ ను అనౌన్స్ చేశారు. అందరూ ఊహించినట్లుగానే ఈసారి జూనియర్ పేరు ఈ లిస్ట్ లో కనిపించింది. విమర్శల కోసం అని కాదు కానీ.. ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫామెన్స్ లో టెంపర్ కూడా కచ్చితంగా ఒకటి. కొన్ని సన్నివేశాల్లో నిజంగానే కంటతడి పెట్టించేశాడు జూనియర్. ఇక క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ లో అయితే.. ఆ సన్నివేశానికి వేరే ఎవరూ న్యాయం చేయలేరని అనిపించేంతగా మెప్పించాడు.

ఎన్టీఆర్ చూపిన ట్యాలెంట్ ను గుర్తించిన ఫిలింఫేర్.. బెస్ట్ యాక్టర్ రేస్ లో జూనియర్ పేరును ప్రకటించింది. అల్లు అర్జన్(సన్నాఫ్ సత్యమూర్తి) - మహేష్ బాబు(శ్రీమంతుడు) - నాని (భలే భలే మగాడివోయ్) - ప్రభాస్(బాహుబలి)లతో జూనియర్ పోటీ పడాల్సి ఉంటుంది. సైమాతో పోల్చితే.. కంచె చిత్రానికి గాను వరుణ్ తేజ్ పేరుకు బదులుగా ఎన్టీఆర్ పేరు జతైంది. అయితే.. ఈ లిస్ట్ విషయంలో మాత్రం జూనియర్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. తమ హీరోకి బెస్ట్ యాక్టర్ గా కచ్చితంగా ఫిలింఫేర్ వచ్చేస్తుందని ధీమాగా చెప్పేస్తున్నారు

,  ,  ,  ,  ,  ,  ,