Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Aug-2015 17:39:49
facebook Twitter Googleplus
Photo

తమిళ సూపర్ స్టార్ విజయ్, శృతి హాసన్ జంటగా తమిళంలో రూపొందిన భారీ బెడ్జెట్ సినిమా ?పులి?. విజయ్ అభిమానులే కాక, సినీ పరిశ్రమ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఈ ఏడాది తమిళనాట అత్యంత క్రేజ్ ఉన్న సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పొచ్చు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాను తెలుగులోనూ పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈమధ్యే చెన్నైలో విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. టీజర్ కూడా అభిమానుల్లో అంచనాలను పెంచేసింది. అయితే సాధారణంగా ఆడియో వేడుకల్లోనే ట్రైలర్ రిలీజ్‌ను జరిపే పద్ధతిని పక్కనబెట్టి ఆ రోజున ట్రైలర్‌ను విడుదల చేయలేదు. దీంతో అభిమానులంతా పులి ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చూడగా, నేడు ట్రైలర్ రిలీజ్ డేట్‌ను విజయ్ అనౌన్స్ చేశారు. ఆగష్టు 20న చెన్నైలో పులి ట్రైలర్ విడుదల చేయనున్నట్లు విజయ్ ఈ సందర్భంగా తెలిపారు. సెప్టెంబర్ 17న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళంలో పెద్ద ఎత్తున విడుదల కానుంది. చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్, హన్సిక్ హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,