Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2016 17:42:10
facebook Twitter Googleplus
Photo

సినీ నటులకు కామన్ గా ఎదురయ్యే సమస్య ఒకటి ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ అయ్యే విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సినిమాలో అయితే కంప్లీట్ చేసేస్తారు కానీ అదే సందర్భం నిజ జీవితంలో ఎదురైతే మాత్రం మాటలు పడాల్సి వస్తుంది. ఏదైనా సీన్ కోసం సినిమాలో తెగ ఏడ్చేస్తే.. ఏం చేశాడ్రా బాబూ.. జీవించేశాడు అంటారు జనాలు. అదే రియల్ లైఫ్ లో ఏడ్చినపుడు మాత్రం.. ఈడు సినిమాల కంటే రియల్ గానే బాగా ఏడుస్తాన్నాడు అంటూ వెటకారాలు ఆడతారు.

ఇలాంటి సమస్యను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యక్షంగా ఫేస్ చేయలేదు కానీ.. యాక్టింగ్ చేయడానికి మాత్రం రియల్ లైఫ్ లో ఆ సంఘటన జరిగినట్లు ఊహించుకుంటానని చెబుతున్నాడు. సాధారణంగా ఎన్టీఆర్ కి రిహార్సల్స్ చేసే అలవాటు లేదు. ఆయా సన్నివేశాలు తన నిజజీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకుంటానంటున్నాడు జూనియర్. అప్పుడు తన నిజమైన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో.. అవే సినిమాలో చూపిస్తానని చెబుతున్నాడు. ఇలా నాన్నకు ప్రేమతో సీన్ ని ఓ సారి ఊహించుకున్నపుడు.. ఏకంగా 20 నిమిషాలపాటు ఏడుస్తూనే ఉన్నాడట. అదే పరిస్థితి తన తండ్రికి వస్తే అనే ఆలోచనే దీనికి కారణం అన్నాడు ఎన్టీఆర్.

సినిమాల్లో తాను చూపేది యాక్టింగ్ కాదని.. తన వాస్తవమైన ఎమోషన్స్ నే మూవీస్ లో ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నించడంతో.. సీన్స్ బాగా పండుతాయని తన యాక్టింగ్ గురించి సీక్రెట్స్ బయటపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్.

,  ,  ,