Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 17:10:32
facebook Twitter Googleplus
Photo

ఒక హాలీవుడ్ సినిమా మన దేశంలో ఒక వారం రోజుల్లోనే రూ.74 కోట్లు కొల్లగొట్టిందంటే నమ్మగలమా..? ?జంగిల్ బుక్? ఆ ఘనతను సొంతం చేసుకుంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ విజువల్ వండర్.. తొలి వారంలో దేశవ్యాప్తంగా రూ.74 కోట్లు వసూలు చేసిందని వాల్ట్ డిస్నీ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంగ్లిష్ తో పాటుగా హిందీ.. తమిళం.. తెలుగు భాషల్లో ఏప్రిల్ 8న ఈ సినిమా భారతీయ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదల కావడం విశేషం. ఇది ఇండియా నేపథ్యంగా సాగే కథ కావడంతో ఈ చిత్రాన్ని వారం రోజుల ముందే ఇక్కడ రిలీజ్ చేశారు.

తొలి రోజే అద్భుతమైన టాక్ తెచ్చుకున్న ఈ సినిమా చిన్నా పెద్దా అని తేడా లేకుండా మన ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలి వీకెండ్లోనే రూ.40 కోట్ల దాకా వసూలు చేసిన ఈ సినిమా తర్వాత నాలుగు రోజుల్లో రూ.34 కోట్ల దాకా వసూలు చేసింది. వీక్ డేస్ లో సైతం ?జంగిల్ బుక్? కలెక్షన్లు తగ్గలేదు. చాలా చోట్ల టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. గురువారం సైతం రూ.11 కోట్లు వసూలు చేయడాన్ని బట్టి ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కుతోందో అంచనా వేయవచ్చు. కొన్ని చోట్ల ఈ చిత్రానికి స్క్రీన్లు పెంచాలన్న డిమాండ్ కూడా వినిపించింది. ఈ సినిమాలో కనిపించే ఏకైక మనిషి పాత్ర మోగ్లీది మాత్రమే. అందులో నీల్ సేథి అనే పిల్లాడు నటించాడు. మిగతా అంతా జంతువుల పాత్రలే ఉంటాయి. వాటి విన్యాసాలు.. అద్భుతమైన విజువల్ ఎఫెక్టులు.. ఎమోషన్స్ ఉన్న మంచి కథ ?జంగిల్ బుక్?కు హైలైట్లుగా నిలిచాయి.

,  ,  ,  ,  ,