Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2016 10:55:34
facebook Twitter Googleplus
Photo

మంచి సినిమాలన్నీ మంచి కలెక్షన్లు సాధిస్తాయనేమీ లేదు. ఐతే జ్యో అచ్యుతానంద మాత్రం బాగానే ఆడుతోంది. ఈ సినిమాకు తొలి వారం ఓ మోస్తరు వసూళ్లు రాగా.. రెండో వారం కలెక్షన్లు మరింత పెరగడం విశేషం. గత శుక్రవారం రిలీజైన నిర్మలా కాన్వెంట్.. సిద్ధార్థ.. చారుశీల ఇంకా ఏవో రెండు సినిమాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. వీటిలో నిర్మలా కాన్వెంట్ మాత్రమే కొంచెం జనాల్లో ఆసక్తి రేకెత్తించింది. కంటెంట్ పరంగా అది కూడా వీక్ కావడంతో ముందు వారం వచ్చిన ?జ్యో అచ్యుతానంద?.. అంతకుముందు వచ్చిన ?జనతా గ్యారేజ్? మీదే జనాలు ఆసక్తి చూపించారు.

ఫస్ట్ వీకెండుకు దీదుగా రెండో వారాంతంలో కలెక్షన్లు వచ్చాయి ?జ్యో అచ్యుతానంద?కు. సెకండ్ వీకెండ్లో ఎ సెంటర్లలో కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. మరోవైపు అమెరికాలోనూ ఈ చిత్రం చాలా బాగా ఆడుతోంది. సెకండ్ వీకెండ్లో లక్షన్నర డాలర్ల దాకా వసూళ్లు రావడం విశేషం. మొత్తంగా ఈ సినిమా 6 లక్షల డాలర్లకు పైనే వసూలు చేసింది. అమెరికాలో బయ్యర్ ఆల్రెడీ లాభాల భాట పట్టాడు. ఈ వారం నాని సినిమా ?మజ్ను? వస్తున్న నేపథ్యంలో ?జ్యో అచ్యుతానంద? కలెక్షన్లు డ్రాప్ అవ్వొచ్చు. ఐతే లో బడ్జెట్ మూవీ కావడంతో దాదాపు అన్ని చోట్లా బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.10 కోట్లకు పైనే షేర్ కలెక్ట్ చేయొచ్చని అంచనా. వరుస ఫ్లాపుల తర్వాత నిర్మాత సాయి కొర్రపాటికి ఈ సినిమాతో కొంచెం డబ్బులు మిగిలాయి.

,  ,  ,  ,  ,  ,  ,