Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-May-2015 11:21:29
facebook Twitter Googleplus
Photo

జ్యోతిలక్ష్మీ అనే పేరుకే ఎంతో క్రేజ్ వుంది. మాస్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించే మంత్రంగా ఈ టైటిల్ కనిపిస్తుంది. అలాంటి టైటిల్ రోల్ తో ఛార్మీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ పాత్రలో ఒయ్యారాలు ఒలకబోయడానికి సిద్ధమవుతోంది. జ్యోతిలక్ష్మీని ముస్తాబు చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కావడంతో ఈ సినిమా కోసం యూత్ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ సినిమా బిజినెస్ తాము ఆశించిన స్థాయిలో జరుగుతోందనీ, ఇటు యూత్ .. అటు మాస్ ఆడియన్స్ లో ఈ సినిమా పట్ల గల ఆసక్తే అందుకు కారణమని నిర్మాత సి.కల్యాణ్ చెప్పాడు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ కీ .. ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన వచ్చిందనీ .. ఈ రెండూ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయని అన్నాడు. ఈ సినిమా ఛార్మీ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనీ, అభిమానుల ప్రశంసలను మరోమారు తెచ్చిపెడుతుందని చెప్పాడు. జూన్ 4 న ఆడియో వేడుక జరుపుకుని 12న ప్రేక్షకుల ముందుకి రానుందని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశాడు. ఈ సినిమా ఘనవిజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

,  ,  ,  ,  ,  ,  ,