Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-May-2015 11:27:53
facebook Twitter Googleplus
Photo

జ్యోతిక తెలుగు ప్రేక్షకులకి కొత్తేమీ కాదు. నగ్మా చెల్లిగానే కాకుండా కథానాయికగా కూడా ఆమెకు ఇక్కడ పేరుంది. 'చంద్రముఖి', 'ఠాగూర్', 'మాస్', 'షాక్' వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆమె బాగా అలరించింది. అలాంటి జ్యోతిక త్వరలో అనువాద చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులని అలరించనుంది. ఏడేళ్ల తర్వాత ఇటీవల ఆమె తమిళంలో '36 వయధినిలే' అనే సినిమాలో నటించింది. టైటిల్ కి తగ్గట్టుగానే తన 36వ ఏట ఆమె నటించిన ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. దీనినే ఇప్పుడు తెలుగులోకి డబ్ చేస్తున్నట్టు జ్యోతిక భర్త సూర్య తెలిపాడు. వచ్చే నెలలో దీనిని రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,