Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Feb-2017 10:50:16
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా రీసెంట్ గా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. తాజాగా భైరవ చిత్రంతో పొంగల్ కి ప్రేక్షకులను పలకరించిన విజయ్.. అట్లీ దర్శకత్వంలో తన 61వ మూవీ చేయనున్నాడు. తెరి మూవీ కాంబినేషన్ కావడంతో.. ఈ ప్రాజెక్టుపై అనౌన్స్ మెంట్ నుంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారంటూ అనౌన్స్ చేసి.. పెద్ద షాక్ నే ఇచ్చాడు అట్లీ. సౌత్ మొత్తంలో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కాజల్ అగర్వాల్.. సమంతలతో పాటు.. సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం సూర్య వైఫ్ అయిన జ్యోతికను కూడా ఇలయదళపతి సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెప్పాడు. ఈ కాంబినేషన్ వినగానే తమిళనాట అంతా విపరీతమైన.. ఈ ప్రాజెక్ట్ పై తెగ చర్చలు నడిచేశాయి. ఇప్పుడీ మూవీ నుంచి జ్యోతిక తప్పుకుందనే వార్త హాట్ న్యూస్ అయిపోయింది.

మూవీ షూటింగ్ ప్రారంభం కావడానికి జస్ట్ 3 రోజుల ముందు జ్యోతిక ఇలా షాక్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రీజన్స్ తెలియకపోయినా.. విజయ్ మూవీలో జ్యోతిక చేయడం లేదనే విషయం తేలిపోయింది. దీంతో.. అర్జంటుగా ఆమె పాత్రను మరో భామతో రీప్లేస్ చేసే ప్రయత్నాల్లో పడ్డు దర్శకుడు అట్లీ. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండడం.. అసలుసిసలైన ప్రత్యేకతగా చెప్పుకోవాలి

,  ,  ,  ,  ,  ,