Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 15:46:40
facebook Twitter Googleplus
Photo

మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మే 27న ఈ చిత్రం తెలుగులో విడుదలవుతోంది.
'రాయుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ - ''ఈరోజు తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించి రికార్డు క్రియేట్‌ చేస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మే 27న రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగులో కూడా ఈచిత్రం ఘనవిజయం సాధిస్తుంది'' అన్నారు.
మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''మార్కెట్‌లో పనిచేసే ఒక లోడ్‌మెన్‌కి లోకల్‌ పొలిటీషియన్‌కి మధ్య జరిగే వార్‌ ఏవిధంగా ఉంటుందో 'రాయుడు'లో చూపిస్తున్నాం. తమిళ్‌ వెర్షన్‌కి మధురై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ స్టోరీ. అదే ఫ్లేవర్‌ మిస్‌ అవకుండా అనంతపూర్‌ రాప్తాడు విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విధంగా తెలుగులో వుంటుంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తమిళ్‌లో ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాను'' అన్నారు

,  ,  ,  ,  ,  ,