Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2016 11:33:36
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్ నటిస్తున్న కబాలి సినిమాపై అంచనాలైతే భారీగానే వున్నాయని మొదట రిలీజ్ చేసిన టీజర్ యు ట్యూబ్ హిట్ల రికార్డే చెబుతుంది. సూపర్ స్టార్ ఈ మధ్య కాలంలో కనిపించనంత స్టైలిష్ గా కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

రంజిత్ పా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడంతో అతను ఈ సినిమాను ఎలా డీల్ చేస్తాడా అన్న ఆసక్తి నెలకొంది. అయితే రోజురోజుకూ ఆ క్రేజ్ రెట్టింపవ్వడం గమనార్హం. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన 35సెకన్ల టీజర్ ఈరోజు విడుదల కావాల్సివుంది. అయితే ఆ టీజర్ యొక్క తమిళ ఆడియో వెర్షన్ నిన్న లీకయ్యి సంచలన రీతిలో షేర్ అవ్వడం ఆశ్చర్యకరం.

వచ్చానని చెప్పు - నేనోచ్చానని చెప్పు.. పాతిక సంవత్సరాల క్రితం ఎలా వున్నానో అలానే తిరిగి వచ్చానని చెప్పు..కబాలి రా అంటూ రజినీ యునీక్ మార్క్ లో చెప్పబోయే డైలాగును ఆలోచించుకుంటూ అభిమానులు వెర్రెక్కిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే పెట్టిన టైటిల్ కరెక్టే అనిపిస్తుంది కదూ..

,  ,  ,  ,