Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jul-2016 11:30:47
facebook Twitter Googleplus
Photo

పైరసీని అరికట్టడం కాదు కదా కనీసం నిలువరించడం సాధ్యం కాదని తాజా పరిణామాలతో మరోసారి రుజువైంది. కబాలి చిత్రం తెరపైకి రావడానికి ముందే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడమే ఇందుకు నిదర్శనం. ఇది ఖండించదగ్గ అంశమే అయినా పైరసీ ఎంతగా వేళూనుకుపోయిందో అర్థం చేసుకోవలసిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్లితే సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కబాలి. భారీ అంచనాల మధ్య ఇంకా చెప్పాలంటే ప్రపంచ సినిమానే ఆసక్తిగా ఈ చిత్రం విడుదలకు ఎదురు చూసింది.
ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాత ధాను పైరసీని అడ్డుకోవడానికి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా పైరసీపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీంతో చాలా వెబ్‌సైట్లు మూత పడ్డాయి. హమ్మయ్య ఇక పైరసీ బెడద తప్పింది అనుకున్నారంతా. అయితే అది పైరసీ అనేది ఓ మహమ్మారి కదా... పూర్తిగా అంతం అవుతుందా? కబాలి చిత్రం తెరపైకి రావడానికి ఒక్క రోజు ముందే 10 నిమిషాల ప్రారంభ సినిమా నెట్‌లో చక్కర్లు కొట్టింది.

దానికి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే అది చిన్న శాంపిల్‌ అని, కబాలి చిత్రం థియేటర్లలోకి రావడానికి కొంత సమయం ముందే తన పని చూపించింది. పూర్తి చిత్రం క్లియర్ కట్‌గా తమిళ్‌గన్ అనే వెబ్‌సైట్‌లో హల్‌చల్ చేయడంతో చిత్ర వర్గం కంగుతింది. విషయం ఏమిటంటే ఇంత వరకూ భారతీయ సినీ పరిశ్రమలో ఏ చిత్రానికి ఇవ్వనంత బూస్టప్‌ను కబాలికి చేశారు.
చిత్రాన్ని చూడడానికి కార్పొరేట్ సంస్థలు బల్క్‌లో భారీ మొత్తాలను చెల్లించి టికెట్లను కొనుగోలు చేయడంతో సాధారణ ప్రేక్షకులు కబాలిని చూడలేని పరిస్థితి. ఎలాగైనా చూసి తీరాలనుకున్న కొందరు మాత్రం నగర శివారు ప్రాంతాల్లో చిన్న థియేటర్లలో టికెట్లు కొని చూడడానికి సిద్ధమయ్యారు. నటుడు శివకార్తికేయన్ లాంటి వారు కూడా సదరు ప్రాంతంలోని థియేటర్లలో కబాలి చిత్రాన్ని చూశారని సమాచారం. కబాలి చిత్రం ఇప్పుడు తమిళ్‌గన్ అనే వెబ్‌సైట్‌లో అందర్నీ ఎంటర్‌టెయిన్ చేస్తోంది. ఆ వెబ్‌సైట్‌పై చిత్ర నిర్మాత తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నది గమనార్హం.

కబాలి కథేందంటే
కబాలి చిత్రంలో రజనీకాంత్ పాత చిత్రాలలో మాదిరిగానే వచ్చిన చిత్రం ఇది. దక్షిణాఫ్రికాలో నెల్సన్‌మండేలా తరహాలో మలేషియాలో తమిళుల హక్కుల కోసం పోరాడిన రజనీకాంత్ 25 ఏళ్లు జైలు జీవితాన్ని గడిపి బయటకు వస్తారు. తన జైలు జీవితకాలంలో బయట జరిగిన సంఘటనలను రజనీకాంత్‌కు అనుచరుడు జాన్‌విజయ్ వివరిస్తాడు. ఆ విధంగా 43 గ్యాంగ్ అనే మాదక ద్రవ్యాల ముఠా అక్కడి యువకులను ఎలా మత్తు మందులకు బానిసలుగా తయారు చేస్తోంది, హత్యలు,అత్యాచారాలు అంటూ ఎలా అరాచకాలు సృష్టిస్తోంది, దీనికంతా కారణం ఎవరు? అన్న విషయాలను కబాలి తెలుసుకుంటాడు.

ఆ తరువాత తమిళలు అధికంగా నివసించే ప్రాంతంలో తన పేరుతో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని ఆ మత్తు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్రం చేస్తూ వారికి పునర్‌జన్మను ప్రసాదించే సేవాకార్యక్రమలు నిర్వహిస్తున్న కలైయరసన్‌ను కలుసుకుంటాడు. అక్కడ యువకులతో తాను ఎందుకు దాదాగా మారాల్సి వచ్చిందన్నది వివరిస్తాడు. కబాలి జైలుకు వెళ్లే సమయంలో తుపాకీ గుండుకు గురైన నిండు గర్బిణి అయిన తన భార్య గుర్తు కొస్తుంది. ఇప్పుడు భార్య,బిడ్డ ఎక్కడున్నారు? ఏమి చేస్తున్నారన్నది తెలియక అయోమయంలో పడతాడు. మరో పక్క మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు కిషోర్‌ను వేటాడి అంతం చేస్తాడు? అయితే చివరికి తన భార్య బిడ్డను కలుసుకున్నాడా? లేదా? అన్నది మాత్రం కబాలి చిత్రం చూడాల్పిందే.

,  ,  ,  ,  ,