Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jan-2016 11:38:05
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికొచ్చి ఆయన్ని కలిస్తే అది పెద్ద వార్త. రామ్ చరణ్ ?సర్దార్ గబ్బర్ సింగ్? సెట్లోకి వచ్చి బాబాయితో ఫొటో దిగితే అదో పెద్ద వార్త. చిరంజీవి వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసినా అది కూడా సెన్సేషనల్ న్యూసే. మెగా అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు. కానీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఈ ఫార్మాలిటీస్ ఏంటన్నదే అర్థం కావడం లేదు. వీళ్ల కలయిక కూడా పెద్ద న్యూస్ అయిపోతుండటం.. ఆ ఫొటోల్ని మెగా అభిమానులు గొప్పగా షేర్ చేసుకుని సంబరాలు చేసుకుంటుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చాలా మామూలు విషయాలు కావాల్సినవి కూడా పెద్ద వార్తాంశాలు కావడం చిత్రమైన విషయమే.

నందమూరి ఫ్యామిలీలో కూడా ఇలాంటి వ్యవహారాలున్నాయి. కానీ అక్కడ బాబాయి - అబ్బాయి మధ్య బంధంలో చాలా మెలికలు ఉన్నాయి. కానీ మెగా ఫ్యామిలీలో కొన్నేళ్ల కిందటి వరకు ఎలాంటి అరమరికలు లేకుండా అంతా సాఫీగా సాగిపోయేది. కానీ అన్నయ్య రాజకీయ రంగప్రవేశం తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. మెగా ఫ్యామిలీలో అందరూ ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు అన్నట్లు తయారైంది పరిస్థితి. మెగా ఫ్యామిలీ కార్యక్రమాలకు క్రమక్రమంగా దూరమవుతూ వస్తున్నాడు పవన్. ఐతే మళ్లీ ఈ కలయికలు మొదలై.. ఫొటో సెషన్లు సాగుతున్నాయి. ఐతే కలిస్తే క్యాజువల్ గా కలిసి వచ్చేయొచ్చు కానీ.. అవేవో ప్రత్యేక కార్యక్రమాల్లా వ్యవహారాలు సాగుతుండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరు - పవన్ కలిసి ఫొటో దిగడమే వార్త అవుతోందంటే.. వాళ్లిద్దరి మధ్య దూరం ఎంత పెరిగిందో అర్థమైపోతుంది. ఐతే ఎలాగూ కలవనైతే కలిశారు.. ఇకనైనా సఖ్యంగా ఉండి.. ఈ కలయికలు న్యూస్ కాకుండా చూసుకుంటే బెటరేమో.

,  ,  ,