Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jun-2016 10:38:34
facebook Twitter Googleplus
Photo

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కబాలికి.. ఒక నిమిషం డ్యురేషన్ తో ప్రోమో రిలీజ్ చేస్తే.. ఏ రేంజ్ సెన్సేషన్స్ రికార్డ్స్ క్రియేట్ అయ్యాయో చూశాం. ఇప్పటికే 2 కోట్ల వ్యూస్ దాటేసి ఇంకా ప్రభంజనం కంటిన్యూ చేస్తుండగా.. ఇప్పుడు 'నెరుప్పుడా' అంటూ సాగే సాంగ్ కి ప్రోమో టీజర్ ఇచ్చారు.

కబాలి కొత్త టీజర్ చూస్తున్నంత సేపు.. ఫ్యాన్స్ ఎవరూ కుదురుగా కూర్చోలేరు. ఎగిరి గంతులేయడమో.. నిలబడి నోరెళ్లబెట్టి చూస్తూనే ఉండాల్సిందే. ప్రతీ ఫ్రేమ్ ని ఆ రేంజ్ లో కట్ చేశారు. తమిళ్ టీజర్ వరకే రిలీజ్ చేసినా.. టీజర్ ప్రారంభంలోనే 'భయమా' అంటూ తెలుగులో క్వశ్చన్ చేయడంతో.. మనోళ్లు కూడా బాగానే ఓన్ చేసేసుకున్నారు. ఇక రజినీకాంత్ 2-3 గెటప్స్ లో కనిపించడం ఈ ప్రోమోలో సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. చివర్లో రజినీ స్టైల్ పంచ్ ఒకటి సూపర్బ్ గా పేలింది.

'వాడికొక్కటే చెప్పు.. నేను తిరిగొచ్చానని చెప్పు' అంటూ రజినీ చెప్పిన డైలాగ్ అదుర్సో అదుర్స్ అంతే. ఇక రజినీ భార్యగా రాధికా ఆప్టే కూడా సూపర్బ్ గా ఉంది. సూపర్ స్టార్ తో సమానంగా గెటప్పులు మార్చేసింది. యంగ్ లుక్ లో ఒక ఫ్రేమ్ లోనే కనిపించినా.. ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేసింది. మొత్తానికి కొత్త టీజర్ తో మళ్లీ కబాలి రికార్డుల వేట మొదలుపెట్టేయచ్చు.

,  ,  ,  ,  ,  ,