Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jul-2016 15:37:00
facebook Twitter Googleplus
Photo

కబాలి.. ఇప్పుడు సౌతిండియన్ సినిమా మొత్తం ఎక్కడ చూసినా వినిపిస్తోన్న ఏకైక పేరు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇక రజనీకి తమిళంలో ఏ స్థాయిలో అభిమానులున్నారో తెలుగులోనూ అందుకు ఏమాత్రం తగ్గకుండా అభిమానులు ఉన్నారన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలన్నీ తెలుగులోనూ ఓ స్ట్రైట్ తెలుగు పెద్ద సినిమాలాగా విడుదలవుతూ ఉంటాయి. ఇక ?కబాలి? విషయంలో మొదట్నుంచీ క్రేజ్ ఆకాశాన్ని అంటడంతో ఈ సినిమా తెలుగు హక్కులకు ఎక్కడిలేని పోటీ కనిపించింది.
ఈ పోటీలో తెలుగు వర్షన్ హక్కులను షణ్ముక ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. షణ్ముక ఫిల్మ్స్ ఈ హక్కులను సుమారు 31 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషంగా చెప్పుకోవాలి. డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే ఇదే రికార్డు బిజినెస్‌గా చెప్పుకోవచ్చు. దీన్నిబట్టిచూస్తే, రజనీకి తెలుగులో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థమైపోతుంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4000లకు పైగా థియేటర్లలో విడుదలవుతోన్న ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పుతుందని ట్రేడ్ భావిస్తోంది.

,  ,  ,  ,  ,  ,