Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2017 14:26:05
facebook Twitter Googleplus
Photo

చందమామ కాజల్.. కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా సౌత్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ భామ ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇస్తోంది. అయితే ఇటీవల డ్రగ్స్ వ్యవహారంలో ఆమె మేనేజర్ రోనీ ఇరుక్కున్న సంగతి తెలిసిందే.. అయితే ఆ తర్వాత కాజల్ పై కూడా సోషల్ మీడియాలో అనేక ప్రశ్నాపర్వాలు ఎదురయ్యాయ్.

ఆమె మేనేజర్ కూడా ఉన్నాడంటే ఆమెకు కూడా డ్రగ్స్ వ్యవహారంలో సంబంధాలు ఉండవచ్చునని కొంతమంది మాట్లాడతంతో.. ఆ విషయంపై తొందరగానే స్పందించి. రోనీ అలాంటి వాడని తనకు తెలియదని వివరణ ఇచ్చింది. అయితే రీసెంట్ గా వేరే మేనేజర్ ని ఎంచుకుందట కాజల్. నేనే రాజు నేనే మంత్రి సినిమా మొదలైనప్పటి నుంచి గిరిధర్ అనే అనుభవం గల మేనేజర్ ని పెట్టుకుందట. ఇక తన బిజీ షెడ్యూల్ బాధ్యతలను ఆ మేనేజర్ కే అప్పజెబుతోందట.

ఇంతకీ ఈ గిరిధర్ ఎవరంటే.. గతంలో పలువురు స్టార్ హీరోయిన్స్ కి మేనేజర్ గా వర్క్ చేసిన వ్యక్తి. అప్పట్లో టాలీవుడ్ లో ఇలియానా కు ఛాన్సులు రావడానికి గిరిధర్ పాత్ర చాలామేరకు ఉందట. దేవదాసు తరువాత ఇలియానాకు స్టార్ హీరోలతో ఛాన్సులు దక్కేందుకు ఎంతో కృషిచేశాడట. జూనియర్ ఎన్టీఆర్-మహేష్ - పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇలియానాకు ఛాన్సులు గిరిధర్ బాధ్యతలోనే వచ్చాయట. సినిమా ఫీల్డ్ లో అందరి ప్రముఖులతో ఈ వ్యక్తికి పరిచయాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక కాజల్ కి కూడా ఇప్పుడు ఓ రెండు స్ట్రాంగ్ ప్రాజెక్టులను ఈ మేనేజర్ సెట్ చేశాడని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,