Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 10:20:01
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు స్లొవేనియాలో పాటలు పాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో కలిసి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చేశారు చిరు. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయిపోగా.. యూరోప్ లో తీస్తున్న పాటలతో సినిమా వర్క్ కూడా ఎండింగ్ కి వచ్చేస్తుందిట. జస్ట్ కొన్ని ప్యాచప్ వర్క్స్ మినహాయిస్తే.. ఖైదీ నెంబర్ 150 దాదాపుగా రెడీ అయిపోయినట్లే అని తెలుస్తోంది.

మెగా స్టైలింగ్ మామూలుగానే అదిరిపోతుంది కానీ.. పాటల్లో అయితే మరీ రచ్చ లేపేస్తారు చిరంజీవి. ఇప్పుడ తన 150వ చిత్రానికి.. పెద్ద కూతురు సుశ్మితే స్టైలింగ్ చేస్తుండడంతో.. మెగా డ్రెసింగ్ పై బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చేసింది సుశ్మిత. అది కూడా కేవలం మాటలతో కాదు.. మెగాస్టార్ లుక్ ని ప్రెజెంట్ చేసేసింది. మూడు నాలుగు రకాల యాంగిల్స్ డాడీ స్టైలింగ్ ను ఫ్యాన్స్ కి చూపించేసింది. డిఫరెంట్ గెటప్.. సూట్-ఓవర్ కోట్.. టీషర్ట్-ఓ వర్ కోట్... రగ్డ్ జీన్స్.. అబ్బో మూడు నాలుగు రకాల గెటప్స్ తో.. చిరు రచ్చ లేపేశారులే.

'ఖైదీ నెంబర్ 150 పాటలో కాస్ట్యూమ్స్.. నా హెడ్ కాస్ట్యూమర్ షాజీ.. ఇంద్రాక్షీ పట్నాయక్.. గౌరి నాయుడు.. ఇదే నా సూపర్ టీం' అంటూ తన కాస్ట్యూమ్ టీంని కూడా ఇంట్రడ్యూస్ చేసింది సుశ్మిత కొణిదెల. ఇలా చిరును చూశాక పాటల్లో చిరు స్టైలింగ్ ని మెగాడాటర్ ఇరగదీసేసింది అనడం చిన్న మాట.

,  ,  ,  ,  ,  ,  ,