Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Aug-2017 12:03:10
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్లలో స్టార్ హీరోయిన్లు అయిపోయిన తరువాత డబ్బుల విషయంలో కాస్త కట్టడిగానే ఉంటారు. అబ్బే వాళ్ళు ఖర్చుపెట్టే పైసల్ గురించి కాదండోయ్.. ప్రొడ్యూసర్ల దగ్గర నుండి లాగే పైసల్ గురించి. అదే కాజల్ అగర్వాల్ వంటి స్టారీమణులు అయితే.. ప్రతీ విషయానికీ ఎంతో కొంత లాగేస్తూ ఉంటారట. ఆమెకు ఎన్ని ఫ్లాపులు ఉన్నా కూడా.. నిర్మాతల దగ్గర నుండి చక్కగా రెండు కోట్లు తీసుకుంటుందంటేనే ఆమె టాలెంట్ ఏంతో చూడొచ్చు. అయితే ఈ తెలివితేటలపై కోర్టు ఇప్పుడు కాజల్ కు అక్షింతలు వేసింది.

గతంలో వివిడి కోకోనట్ ఆయిల్ అనే బ్రాండు కోసం కాజల్ ఒక యాడ్ తో పాటు ఒక ఫోటో షూట్ కూడా చేసింది. కట్ చేస్తే.. తన పర్మిషన్ లేకుండా ఎక్కువరోజుల పాటు తన ఫోటోలను వాడేసుకుంటున్నారని కాజల్ కోర్టుకు ఎక్కింది. మద్రాస్ హైకోర్డులో సదరు బ్రాండ్ పై అమ్మడు పిటిషన్ ఫైల్ చేసింది. అయితే పూర్వాపరాలను అన్నీ పరిశీలించి.. ఎంతో డబ్బులిచ్చి యాడ్ ను చేయించుకున్న సంస్థకు 60 ఏళ్ళ వరకు కాజల్ ఫోటోను అలాగే ఆ యాడ్ ను వాడుకునే సౌలభ్యం ఉందని చెబుతూ.. ఇప్పటివరకు ఆ కంపెనీకి అయిన కోర్టు ఖర్చంతా కూడా కాజల్ అండ్ కో పెట్టుకోవాలని కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది.

నిజానికి ఈ కేసులో ట్విస్టు ఏంటంటే.. అసలు కాజల్ ఆ యాడ్ చేశాక అమ్మడికి ఒక పెద్ద బ్రాండ్ కోకోనట్ ఆయిల్ యాడ్ వచ్చింది. ఈ కొత్త యాడ్ చేసుకోవాలంటే పాత యాడ్ తాలూకు వారి డీల్ ను క్యాన్సిల్ చేసుకోవాలి. అందుకని తెలివిగా వ్యవహరించి అమ్మడు ఇలా కోర్టుకు ఎక్కింది. అయితే మరో ఓ రెంజులో కాసుల కక్కూర్తి ఉంటే కోర్టునుండి అక్షింతలూ మొట్టికాయలూ తప్పవని ఈరోజు అమ్మడికి అర్ధమవుతుందిలే అంటున్నారు జనాభా.

,  ,  ,  ,  ,