Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2015 12:12:20
facebook Twitter Googleplus
Photo

నేను - శైలజ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇటీవలే టీజర్ రిలీజై యూత్ ని ఆకట్టుకుంది. రామ్ ఈసారి హిట్టు కొట్టేసే ఛాన్సుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ఈ సినిమా ఆన్ సెట్స్ వ్యవహారం గురించి చిత్రకథానాయిక కీర్తి చెప్పుకొచ్చింది.

నేను - రామ్ తో ప్రేమలో పడ్డాను. అతడిలోని ఎనర్జీతో ప్రేమలో పడ్డాను. మేం ఒకరితో ఒకరం ప్రేమలో పడ్డాం. అయితే అదంతా సినిమా కోసం మాత్రమే. ఆన్ సెట్స్ కలిసి పనిచేసేప్పుడు మేం తమిళ్ లో మాట్లాడుకునేవాళ్లం. రామ్ - నేను తమిళ్ లో బాగానే మాట్లాడుకుంటాం. అందువల్ల మేం మమేకమైపోవడం సులువైంది.. అంటూ కీర్తి చెప్పుకొచ్చింది.

నేను ఎంత లేజీ ఫెలోనో రామ్ అంత ఎనర్జిటిక్. మేం పూర్తిగా ఒకరికొకరం ఆపోజిట్ అంటూ అసలు క్లూ ఇచ్చేసింది. అందుకే నేను శైలజ మూవీలో ఈ ఇద్దరికీ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజులో వర్కవుటైందని అర్థమవుతోంది. టీజర్ తోనే మెప్పించారు. మరి సినిమాతో ఇంకెంత మెప్పిస్తారో? ముఖ్యంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో పడేస్తారనడంలో సందేహమే లేదు.

,  ,  ,  ,