Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Apr-2016 11:15:54
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదటి సారిగా జట్టు కట్టింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. మొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీ మగధీరలో యువరాణిగా కనిపించిన కాజల్.. మరోసారి అదే తరహా రోల్ ని చేస్తోంది. పవన్ తో చందమామ కాంబినేషన్.. భలే క్యూట్ గా ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

కాజల్ కెరీర్ డైలమాలో ఉందన్న టైంలో పవన్ మూవీ సర్దార్ లో వచ్చిన ఆఫర్ తో.. మరోసారి ఈ భామ టాప్ రేంజ్ కి చేరిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్ కోసం కాజల్ బాగానే కష్టపడింది. ఈమె పాత్రకు సంబంధించిన సీన్స్ ను.. ఎక్కువగా మూవీ షూటింగ్ ప్రారంభంలోనే తీసేశారు. గుజరాత్ లో షెడ్యూల్ లో కాజల్ టాకీ పార్ట్ చాలా వరకూ చిత్రీకరించినా.. చివర్లో పాటల కోసం బాగా టైం వెచ్చించింది కాజల్.

చివరి షెడ్యూల్ లో భాగంగా రెండు పాటల కోసం స్విట్జర్లాండ్ వెళ్లి మంచుకొండల్లో పాటలు తీశారు. ఆ పాటకు సంబంధించిన స్టిల్ ఇది. ఈ ఫోటోలో కాజల్ వెనక నుంచి మాత్రమే కనిపిస్తున్నా.. తన స్కిన్ టోన్ - డ్రెసింగ్ తో మత్తెక్కించేస్తోంది. పవన్ పక్కన మెరిసిపోతున్న చందమామ.. ఫోటోలోనే ఇలా మెరుస్తుంటే ఇక సినిమాలో మరింత మనోహరంగా కనిపించడం ఖాయమని చెప్పచ్చు.

,  ,  ,  ,  ,