Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2017 11:19:49
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. ఆమెతో పాటు ఎంతో మంది అందమైన హీరోయిన్స్ పరిచయం అయినా మొదట్లో బానే ఉన్నారు. కానీ కొద్ది కాలానికే కనిపించకుండా పోయారు. కానీ కాజల్ మాత్రం ఇంకా తన అందాన్ని పెంచుకుంటూ.. అభిమానులను ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు అమ్మడు హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసి రికార్డ్ అందుకుంది.

అయితే రీసెంట్ గా అమ్మడు ఫెస్ బుక్ అభిమానులతో ఇంటర్వ్యూలో పాల్గొంది. లైవ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు టక టక సమాధానం చెప్పేసింది. ముందుగా మెర్సల్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాను చాలా ఇష్టంగా తీశాను. మంచి స్టోరీ. నేను విజయ్ తో కలిసి పని చేయడం ఇది మూడోసారి. సమంతతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందంటూ..ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో డాక్టర్ గా కనిపించనున్నాని దర్శకుడు- సంగీత దర్శకుడి గురించి వివరించింది కాజల్.. డైరెక్టర్ అట్లీ సింపుల్ గా ఉంటారు. అభిమానిగా రెహమాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన సంగీతం అందిస్తున్న సినిమాల్లో నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.

ఇక తనకు నచ్చని క్యారెక్టర్ బృందావనం లో చేసిన భూమి పాత్ర అని చెప్పింది కాజల్. ఆ క్యారెక్టర్ మీకు నచ్చోచ్చు కానీ నిజ జీవితంలో ఆలాంటి క్యారెక్టర్ ఉంటే చాలా బోరింగ్ అని రీల్ లైఫ్ లో ఒకే బట్ రియల్ లైఫ్ లో నాట్ ఒకే అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో చేస్తున్న పిసినిమా గురించి అడుగగా.. 50 సినిమాల తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ తో ఎమ్మెల్యే సినిమాతో చేస్తున్నాను. తను నేను ఎప్పటికి ఒకేలా ఉన్నాం. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నామని చెప్పింది. ఇక తన తదుపరి చిత్రాల గురించి చెబుతూ.. ఎమ్మెల్యే తర్వాత పారిస్ పారిస్’ షూటింగ్ను త్వరలో ప్రారంభించనున్నా

,  ,  ,  ,  ,