Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2017 15:53:51
facebook Twitter Googleplus
Photo

శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో సీక్వెల్ 2.0కి.. షూటింగ్ పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరోవైపు కాలా కరికులన్ అంటూ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఓ సినిమా చేస్తున్నారు రజినీ.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా.. ఇప్పుడు మరో షెడ్యూల్ ను కూడా ఫినిషింగ్ దశకు తెచ్చేశారు. కాలా చిత్రంలో ముంబైలోని స్లమ్ ఏరియా అయిన ధారావి ప్రాంతానికి గ్యాంగ్ స్టర్ లీడర్ గా కనిపిస్తున్నారు రజినీ. అయితే.. ఈ మూవీని తమిళ్ తోపాటు.. తెలుగు.. హిందీలో కూడా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. బ్యాక్ డ్రాప్ కూడా ముంబై కావడంతో.. కాలా చిత్రాన్ని ఒకేసారి హిందీలో కూడా షూటింగ్ చేస్తున్నారట.

ప్రతీ సన్నివేశాన్ని తమిళ్ తోపాటు.. హిందీ.. మరాఠీల్లో కూడా పిక్చరైజ్ చేస్తున్నారట. కాలాకు డబ్బింగ్ కూడా రజినీనే చెప్పుకోనున్నారని తెలుస్తోంది. చివరగా 2000వ సంవత్సరంలో అనిల్ కపూర్ మూవీ బులందీ చిత్రంలో డబ్బింగ్ చెప్పుకున్నారు రజినీ. పెదరాయుడు మూవీకి రీమేక్ గా రూపొందిన ఆ చిత్రంలో గజరాజ్ ఠాకూర్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన రజినీకాంత్.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత కాలా కోసం తన గొంతును హిందీలో వినిపించనున్నారు.

,  ,  ,  ,  ,  ,