Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2017 12:23:30
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు ఈ ఏడాది చాలా రకాలుగా స్పెషల్ అని చెప్పాలి. ఈ సంవత్సరంతో కాజల్ సినీ అరంగేట్రం చేసిన దశాబ్దం పూర్తి కావస్తోంది. ఒక హీరోయిన్ పదేళ్ల పాటు కెరీర్ కంటిన్యూ చేయగలగడం.. అది కూడా టాప్ రేంజ్ స్టార్ హీరోయిన్ అనే బిరుదును కాపాడుకోగలగడం చాలా అరుదైన విషయం.

ఈ పదేళ్లలో కాజల్ చేసిన సినిమాల కౌంట్ కూడా తక్కువేమీ కాదు. ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రం.. కాజల్ కు 50వ సినిమా కావడం విశేషం. పదేళ్లలో 50 సినిమాలు.. అంటే ఏడాదికి ఐదేసి సినిమాల చొప్పున చేసుకుంటూ వచ్చేస్తోంది ఈ 32 ఏళ్ల బ్యూటీ. కెరీర్ 10 ఏళ్లు పూర్తి కావడం.. హాఫ్ సెంచరీ మూవీ కావడంతో పాటు.. తన మొదటి దర్శకుడు అయిన తేజతోనే.. 50వ సినిమా కూడా చేస్తుండడం యాదృచ్ఛికమే అయినా ఆశ్చర్యకరమే. ఈ సినిమా నాకు చాలా రకాలుగా స్పెషల్. లక్ష్మీ కళ్యాణ్ తర్వాత నా మెంటార్ తేజ సార్ తో మళ్లీ పదేళ్లకు సినిమా చేస్తున్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలను ఆయన నేర్పించారు. ఈ సమయంలో నేను ఎంతో పుంజుకున్నాను. ఈ సినిమాలో నా కేరక్టర్ చాలా కొత్తగా ఉంటుంది అంటోంది కాజల్.

రానాతో ఈ సినిమా చేస్తుండడంతో తనకు ఈ చిత్రం మరింత స్పెషల్ గా మారిందని కాజల్ చెబుతోంది. ఆలోచనలు అభిప్రాయాలు సవాళ్లను పంచుకోవడం.. మన ఆలోచనా స్థాయిని పెంచుతుంది.

,  ,  ,  ,  ,  ,