Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 19:07:50
facebook Twitter Googleplus
Photo

అంతే మరి.. స్టార్ డమ్ అనేది ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా పోతుంది కూడా. ?లక్ష్మీకళ్యాణం? సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా సాదాసీదాగా కనిపించిన కాజల్ అగర్వాల్ ను చూసినపుడు ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ?చందమామ? సినిమాతో ఆమె దశ తిరిగిపోయింది. ఆ సినిమా విడుదలయ్యాక ఏడాది తిరిగేలోపు స్టార్ హీరోయిన్ అయిపోయింది కాజల్. ఆ తర్వాత ఏడెనిమిదేళ్ల పాటు ఆమెకు ఎదురే లేదు. తెలుగు-తమిళం-హిందీ.. ఇలా మూడు భాషల్లోనూ హవా సాగించింది చందమామ.

కానీ ఏడాది కాలంగా ఆమె కథ అడ్డం తిరుగుతోంది. తమిళంలో ధనుష్ సరసన నటించిన ?మారి? పెద్ద ఫ్లాప్ అవ్వగా.. తెలుగులో భారీ ఆశలు పెట్టుకుని సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం సినిమాలు కాజల్ కు చేదు జ్నాపకాలుగా మిగిలాయి. ఇక హిందీలో అయినా రాత మారుతుందేమో.. అక్కడే సెటిలైపోదాం అనుకుంటే ?దో లఫ్జోంకీ కహానీ? కూడా పూర్తిగా నిరాశ పరిచింది. ఇంతకుముందు కాజల్ నటించిన సింగం.. స్పెషల్ చబ్బీస్ సినిమాలు రెండూ సూపర్ హిట్లే. కానీ లేటెస్ట్ మూవీ మాత్రం దారుణమైన ఫలితాన్ని చూసింది. ఆ సినిమాకు 5-6 కోట్ల కలెక్షన్లు వస్తే ఎక్కువ అన్నట్లుంది పరిస్థితి. అసలే సినిమాలు వరుసగా ఫెయిలవుతూ ఉంటే.. అమ్మడు అనవసరంగా బరువు తగ్గడంతో ముఖంలో గ్లో కూడా పోయింది. ఆమె లేటెస్ట్ లుక్ చూసి అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఏడాది వ్యవధిలో అన్నీ ఎదురుదెబ్బలే తిన్న కాజల్ ను చూసి జనాలు జాలి పడే పరిస్థితి వచ్చింది. త్వరలోనే అమ్మడు దుకాణం సర్దేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో.

,  ,  ,  ,  ,  ,  ,