Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Apr-2016 11:16:12
facebook Twitter Googleplus
Photo

సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కు కూడా రెడీ అయిపోతోంది. అయితే సర్దార్ సుందరి కాజల్ అగర్వాల్ మాత్రం ఇంకా ప్రమోషన్స్ లో భాగం కాలేదు. దీనికి కారణం కాజల్ సమీపబంధువు ఒకరు మరణించడమే. ఆరోగ్యం విషమించిన పరిస్థితిలో హాస్పిటల్ లో చేర్పించినా.. ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు డాక్టర్లు. దీంతో ప్రస్తుతం కాజల్ విషాదంలో మునిగిపోయింది.

అయితే.. ఏప్రిల్ 7 - 8 తేదీల్లో మాత్రం విస్తృతంగా ప్రచారం చేసేందుకు కాజల్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. నిజానికి సర్దార్ పై చందమామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన కెరీర్ పై సందిగ్ధం నెలకొన్న పరిస్థితిలో వచ్చిన ఆఫర్ ఇది. ఈ మూవీ హిట్ కావడం కాజల్ కు చాలా ముఖ్యం. దీంతో పాటు.. కాజల్ ఇప్పటివరకూ నటించిన అన్ని సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇదే అని చెప్పాలి. వీటన్నిటి కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో తొలిసారి జత కట్టింది కాజల్. ఈ మూవీని కాజల్ చాలా సీరియస్ గా తీసుకుందనే చెప్పాలి.

ఈ భామ చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవం కూడా ఉన్నా... అందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరు కాజల్. కానీ సర్దార్ లో మాత్రం సోలో హీరోయిన్ కావడంతో.. సినిమా సక్సెస్ సాధిస్తే ఆ క్రెడిట్ లో కాజల్ కు కూడా చాలా భాగం ఉంటుంది. అందుకే తను బాధలో ఉన్నా.. ప్రమోషన్స్ లో పాల్గొనాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,