Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 11:03:06
facebook Twitter Googleplus
Photo

సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్లు ఎదురయ్యాయి కాజల్ అగర్వాల్కు. తమిళం.. హిందీలోనూ ఆమె సినిమాలు బోల్తా కొట్టడంతో తన పని అయిపోయిందనే అనుకున్నారంతా. కానీ ఈ ఏడాది కాజల్ భలే బౌన్స్ బ్యాక్ అయింది. తెలుగులో ఖైదీ నంబర్ 150.. నేనే రాజు నేనే మంత్రి.. తమిళంలో మెర్శల్ మంచి ఫలితాన్నందించాయి చందమామకు. దీంతో అమ్మడికి మళ్లీ మునుపటిలా డిమాండ్ పెరిగింది. మధ్యలో పారితోషకం కొంచెం తగ్గించిన కాజల్.. ఇప్పుడు మళ్లీ మునుపటిలా భారీ పారితోషకం డిమాండ్ చేస్తోందట.

‘నేనే రాజు నేనే మంత్రి’ తీసిన తన గాడ్ ఫాదర్ తేజ దర్శకత్వంలోనే కాజల్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కథానాయకుడు. నేనే రాజు నేనే మంత్రి కి కాజల్ పారితోషకాన్ని బాగానే తగ్గించుకుందట. అప్పటికి తేజకు క్రేజ్ లేకపోవడంతో ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తనకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చాడన్న కృతజ్నతతో కాజల్ కూడా ఈ సినిమా తక్కువ పారితోషకానికే చేసింది.

కానీ వెంకీ సినిమాకు వచ్చేసరికి అలాంటి డిస్కౌంట్లు ఏమీ ఇవ్వట్లేదట. ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు లేకపోవడం ఇందుకు ఒక కారణమైతే.. సీనియర్ హీరోల సరసన నటించడం వల్ల తన కెరీర్ కు కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి కొంచెం పారితోషకం ఎక్కువే తీసుకోవాలని ఆమె ఫిక్సయిందట. ఖైదీ నంబర్ 150 కి కూడా ఆమె అలాగే భారీ రెమ్యూనరేషన్ తీసుకుందట.

,  ,  ,  ,  ,