Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2016 11:05:33
facebook Twitter Googleplus
Photo

అసలే అంచనాలు భారీగా ఉన్నాయి ?బాహుబలిః ది కంక్లూజన్? మీద. ఇలాంటి టైంలో రాజమౌళి అండ్ కో సాధ్యమైనంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుందేమో అనుకున్నారంతా. చడీచప్పుడు లేకుండా షూటింగ్ అవగొట్టి.. ఆ తర్వాత విడుదల దగ్గరపడే సమయంలో ప్రమోషన్ మొదలుపెడతారేమో అనుకున్నారు. కానీ బాహుబలి ఫిలిం మేకర్స్ ప్లాన్ మరోలా ఉంది. ఇప్పట్నుంచే ప్రమోషన్ ఓ రేంజిలో చేసేస్తూ హైప్ మరింత పెంచేస్తున్నారు. ఈ రోజు బాహుబలి-2 క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే. ఐతే ఉదయం షూటింగ్ మొదలవడానికి ముందు ఏం జరిగిందో చెబుతూ కాసేపటికే అప్ డేట్స్ ఇచ్చేశాడు నిర్మాత శోభు యార్లగడ్డ. మధ్యాహ్నం తాను ప్రభాస్ ను బాహుబలి డ్రెస్సులో చూశానంటూ ఎగ్జైట్ అయిపోతూ ట్వీట్ పెట్టాడు రానా.

ఇక సాయంత్రం రాజమౌళి పెట్టిన ట్వీట్ అయితే జనాల్లో విపరీతమైన ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చింది.యుద్ధ సన్నివేశంలో ప్రభాస్ చెయ్యి ముందుకు పెట్టి అభివాదం చేస్తుండగా తీసిన ఫొటో.. వీడియో ట్విట్టర్లో షేర్ చేశాడు రాజమౌళి. ఈ వీడియోలో అందరూ కలిసి ఒక్కసారిగా జై మహిష్మతి అని నినాదాలు చేయడం కనిపించింది. అవతలి వైపు రాజమౌళితో పాటు వందలమంది యూనిట్ సభ్యులున్నారు. మొదటి రోజు యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ చాలా బాగా జరిగిందని.. నెలల తరబడి చేసిన ప్లానింగ్ చాలా ఉపయోగపడిందని.. అంతా చాలా ప్రశాంతంగా సాగిపోయిందని ట్వీట్ చేశాడు జక్కన్న. క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఇలాగే రోజూ అప్ డేట్స్ ఇస్తాడేమో చూడాలి జక్కన్న.

,  ,  ,  ,  ,