Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jun-2017 17:17:40
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నితిన్ ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు గడిచిపోయింది. 2002 జూన్ 14న నితిన్ నటించిన తొలి చిత్రం జయం థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు 15 ఏళ్లు కెరీర్ పూర్తి చేసుకున్న నితిన్.. త్వరలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న లై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

ఆగస్ట్ 11న లై చిత్రం రిలీజ్ కానుండగా.. ఈ 15 ఏళ్ల కెరీర్ లో నితిన్ ఎన్నో విజయాలతో పాటు అంతకుమించిన ఇబ్బందులను కూడా ఎదుర్కున్నాడు. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన నితిన్.. తొలిరోజుల్లోనే దిల్.. సై వంటి చిత్రాలతో స్టార్ డం అందుకున్నాడు. అయితే.. ఆ తర్వాత ఆ స్పీడ్ ను కొనసాగించడంలో విఫలమైన మాట వాస్తవమే. కొన్నేళ్ల పాటు అసలు హిట్ అనే మాటకు దూరమైన నితిన్ ఫ్యామిలీ.. నిర్మాతలుగా నష్టాలను ఫేస్ చేయాల్సి వచ్చింది.

అయినా సరే ఎంతో హార్డ్ వర్క్ చేసి.. మళ్లీ ఇష్క్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత అదే ఫామ్ ను కొనసాగించడంలో మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్ అనే కార్డ్ నితిన్ కి బాగానే హెల్ప్ అయింది. ఏ మాత్రం మొహమాట పడకుండా తను పవన్ వీరాభిమాని అని చెబుతాడు నితిన్. నిజానికి డబ్బుల కోణంలోంచి కాకుండా.. సినిమాలంటే నితిన్ ఫ్యామిలీకి ఉన్న ప్యాషన్.. నితిన్ ని మళ్లీ తిరిగి బూమ్ లోకి తెచ్చిందని చెప్పచ్చు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ లు నిర్మాతలుగా మారి తీస్తున్న చిత్రంలో నితిన్ ను హీరోగా తీసుకోవడానికి కారణం.. ఈ కుర్ర హీరోకు వర్క్ పట్ల ఉన్న కమిట్మెంట్ మాత్రమే కారణం.

,  ,  ,  ,  ,