Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Sep-2016 12:11:49
facebook Twitter Googleplus
Photo

2014లో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. ఇప్పుడు విడాకుల బాట పట్టేసింది. పెళ్లయ్యాక కూడా సినిమాలు మానడం లేదన్నదే ఈ విడాకులకు రీజన్ గాచెప్పుకుంటున్నారు. ఈ వివాదంపై ఒక్క అమలాపాల్ తప్ప.. ఆమె భర్త దర్శకుడు విజయ్ తో సహా ప్రతీ ఒక్కరూ మాట్లాడేశారు. ఇప్పుడు అమలాపాల్ పేరు చెప్పకపోయినా.. పెళ్లి- సినిమాలు అనే టాపిక్ పై కాజల్ పిచ్చ క్లారిటీతో మాట్లాడేస్తోంది.

?పెళ్లి చేసుకున్నాక యాక్టింగ్ అంటే బాగా ఆలోచించాల్సిన విషయం. మ్యారేజ్ తర్వాత కొత్తగా బాధ్యతలు వస్తాయి. ఇంకో ఫ్యామిలీలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అక్కడ వారి ఒపీనియన్స్ కు కూడా వాల్యూ ఇవ్వాలి కదా.. లైఫ్ పార్ట్నర్ తో టైమ్ స్పెండ్ చేసేందుకు షెడ్యూల్స్ అడ్డు రావచ్చు. అలాంటప్పుడు మూవీస్ లో యాక్ట్ చేయడం కష్టం కావచ్చు. నాకైతే సినిమాలు మానేయాలని లేదు కాని... రెండు పడవల ప్రయాణం పెద్ద రిస్క్. అందుకే నేను చేయాలని అనుకుంటున్న రోల్స్ అన్నీ పూర్తే చేసేసి అప్పుడు పెళ్లి వైపు అడుగులు వేస్తా? అంటోంది కాజల్.

ప్రస్తుతం మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150లాంటి ప్రతిష్టాత్మక చిత్రం చేశాక కూడా.. అమ్మడికి ఇంకా డ్రీమ్ రోల్స్ ఉన్నాయన్న మాట.

,  ,  ,  ,  ,