Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 11:42:27
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు అమెరికాలో ఆడియో రిలీజ్ అనుకోవడమే కాని ఆ ఫీట్ ను సాధించినవారే లేరు. అందరికంటే ముఖ్యంగా.. ఓవర్ సీస్ మైటీ హీరో అయిన మహేష్ బాబు కూడా ఇంతవరకు అక్కడ ఈవెంటును ప్లాన్ చేసుకొని కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. గతంలో ఓ రెండు సార్లు 1 నేనొక్కడినే.. ఆ తరువాత శ్రీమంతుడు టైములో కూడా అలాగే ప్లాన్ చేశారు. కాని వీసాలు వగైరా సెట్టవ్వలేదని అన్నారు. చివరకు మహేష్ తన ఆడియోలను అమెరికాలో చేద్దామనుకొని ఫెయిల్ అయ్యి.. చివరకు హైదరాబాద్ లో పెట్టుకున్నాడు.

ఇక మహేష్ కాకుండా అమెరికాలో ఏ హీరో ఆ ఫీట్ చేయాలన్నా.. అసాధ్యం కాదు కాని.. చేయడం వలన పెద్దగా యూజ్ ఉండదు. కాకపోతే అమెరికాలో మార్కెట్ పెంచుకుందామన్న స్టార్లు అందరూ ఇప్పుడు అక్కడే కన్నేశారు. అదిగో ఇప్పటికే డబూ రత్నానీతో పోస్టర్ ఫోటో షూట్ అన్న జూ.ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా తన ''జనతా గ్యారేజ్'' ఆడియో రిలీజ్ ను ఏకంగా న్యూ జెర్సీలో చేద్దాం అనుకుంటున్నాడట. అప్పట్లో ఇలా మహేష్ చేయాలని ప్లాన్ చేయగా వీసా ప్రాబ్లమ్ లు తదితరాలు తలెత్తాయి. మరి మహేష్ ఫెయిల్ అయిన ఈ యాస్పెక్ట్ లో ఎన్టీఆర్ సక్సీడ్ అవుతాడా?

ఇదంతా ఏమో గాని.. ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ ఓ రేంజులో సాగిపోతోంది. మనకు మాత్రం రోజుకో రూమర్ ఇలా వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,