Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2017 12:41:04
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. గతేడాది వరుస ఫ్లాపుల తర్వాత ఒక సమయంలో.. ఈమె కెరీర్ సందిగ్ధంలో పడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ చేసి సెన్సేషన్ సృష్టించిన కాజల్.. ఆ తర్వాత మెగాస్టార్ తో ఖైదీ నంబర్ 150తో కెరీర్లో అతి పెద్ద సక్సెస్ తో పాటు.. ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ను కూడా సొంతం చేసుకుంది.

అయితే.. కాజల్ ఇప్పటికీ టాప్ హీరోలతో హీరోయిన్ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్టులే. కానీ ఐటెం సాంగ్ లో చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. సహజంగా నేను ఐటెం సాంగ్స్ చేయను. నిజానికి డ్యాన్స్ నెంబర్స్ ను వాటిని ఎలా పిక్చరైజ్ చేస్తారనే అంశం చాలా ముఖ్యం. ఆ పాట గురించి చెప్పిన తర్వాత.. నాకు ఎన్టీఆర్ తో ఉన్న ఈక్వేషన్స్ ను దృష్టిలో పెట్టుకుని పక్కాలోకల్ పాటలో చేయాలని నిర్ణయించుకున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే తారక్ కోసమే ఆ పాటలో నటించా అని చెప్పేసింది కాజల్. ఆ తర్వాత అలాంటి ఆఫర్స్ చాలానే వచ్చిన ఒప్పుకోలేదని కూడా అంటోందీ చందమామ.

తెలుగులో నేనే రాజు నేనే మంత్రి అంటూ వస్తున్న రానాకు హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్.. తమిళ్ లో అజిత్ తో వివేగం.. విజయ్ తో ఓ సినిమాలోనూ నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,