Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2017 15:45:32
facebook Twitter Googleplus
Photo

టైగర్ కొత్త సినిమా సంగతులు ఇప్పుడు హాట్ టాపిక్. మరో 10 రోజుల్లో జై లవ కుశ రిలీజ్ కానుండడంతో ఇప్పటికే నందమూరి అభిమానులు హంగామా స్టార్ట్ చేసేశారు. ఈ చిత్రానికి రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించగా.. ఈ కథను ఎంచుకోవడంలో ఎంతో అలర్ట్ గా ఉన్నట్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

టెంపర్.. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో.. దాని వెంట జనతా గ్యారేజ్.. ఇలా వరుసగా విభిన్నమైన సినిమాలను చేసిన తర్వాత.. మరుసటి చిత్రంపై చాలానే ఆలోచించాడట. అలాంటి సమయంలోనే దర్శకుడు బాబీ.. ఈ కథ చెప్పాడని అన్నాడు జూనియర్. ముఖ్యంగా జై పాత్రపై తాను ప్రేమలో పడిపోయాడట కూడా. అయితే.. ఈ పాత్రకు తాను న్యాయం చేయగలడా.. అసలు ఈ కథను తాను ఒప్పుకోవాలా లేదా అనే సందిగ్ధంలో మునిగాడట ఎన్టీఆర్. అందుకే వారం రోజుల పాటు టైం తీసుకుని.. అప్పుడు సినిమాకు ఒప్పుకున్నట్లుగా చెప్పిన యంగ్ టైగర్.. ఈ సమయంలో ఓ ఇద్దరు దర్శకులతో కథ గురించి డిస్కస్ చేశాడట. అయితే.. ఆ ఇద్దరు డైరెక్టర్ల పేర్లను మాత్రం చెప్పలేదు జూనియర్.

సినిమా సక్సెస్ అయిన తర్వాతే.. వారిద్దరి పేర్లు చెబుతానని ఎన్టీఆర్ అనడంతో.. ఎవరా ఇద్దరు అని ఇండస్ట్రీలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళితో ఎన్టీఆర్ కు ఉన్న సాన్నిహిత్యం సంగతి తెలిసిందే కాబట్టి.. ఒకరు జక్కన్నే అని అందరూ ఫిక్స్ అయ్యారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ.. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ లు ఎన్టీఆర్ కు బాగా క్లోజ్.

,  ,  ,  ,  ,