Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 11:43:30
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ టైమ్.. ఈ ఏడాది పిచ్చ పీక్స్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. హిట్ల సంగతి పక్కన పెడితే.. సినిమాల కౌంట్ మాత్రం పెరిగిపోతోంది. అటు హీరోయిన్ గానే కాదు.. రీసెంట్ గా ఐటెం భామగా కూడా కాజల్ ఇరగదీసేసి.. సక్సెస్ అయిపోయింది. అదే జోష్ తో ఓ తమిళ డబ్బింగ్ తో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది కాజల్.

కోలీవుడ్ మూవీ కావలై వేందాం చిత్రంలో జీవాకి జోడీగా నటించింది కాజల్. ఈ సినిమాలో కాజల్ బికినీ వేసిందని కూడా ప్రచారం జరిగింది కానీ.. ఓ సాంగ్ ప్రోమోతో అంత సీన్ లేదనే విషయం తెలిసిపోయింది. ఇప్పుడీ రొమాంటిక్ చిత్రాన్ని 'ఎంతవరకు.. ఈ ప్రేమ' అనే టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. దసరా కానుకగా.. రెండు భాషల్లోనూ రిలీజ్ కానుంది.

రంగం మూవీతో టాలీవుడ్ లో కూడా జీవా సక్సెస్ సాధించాడు కానీ.. అంత అగ్రెసివ్ గా ఈ కుర్రాడి సినిమాలు డబ్బింగ్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కాజల్ అగర్వాల్ ని నమ్మకుని కాస్త రేటు బాగానే పెట్టి కొనేసి మరీ తెలుగులోకి తెస్తున్నారు నిర్మాత డి. వెంకటేష్. మరి కాజల్ ఎంతవరకు ప్రేమ కురిపిస్తుందో.. ఎంతవరకూ ఈ సినిమాను కాపాడుతుందో తెలియాలంటే.. దసరా వరకు ఆగాల్సిందే.

,  ,  ,  ,  ,  ,