Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2015 16:27:16
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో సర్ధార్ గబ్బర్ సింగ్? తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే ఇదో క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్. పవర్ సినిమా తర్వాత బాబికి కూడా ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. అందుకే ఈ ఇద్దరూ ఏ విషయంలోనూ రాజీకి రాకుండా అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ?అత్తారింటికి దారేది?వంటి ఇండస్ర్టీ హిట్ తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇది. గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్ కు కంటిన్యూషన్ పార్ట్ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ - టీజర్ తో ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లిపోయాయి.

ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలన్నది పవన్ ఆలోచన. అందుకు తగ్గట్టే షూటింగ్ లో స్పీడ్ పెంచారు. ఇటీవలే హైదరాబాద్ లో కొన్నిరోజుల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం టీమ్ గుజరాత్ లో ఓ భారీ షెడ్యూల్ ను మొదలుపెట్టింది. నెలరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ - కాజల్ అగర్వాల్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొననున్నారు.

కొత్త షెడ్యూల్ కోసం నిన్ననే పవన్ అహ్మదాబాద్ లో ల్యాండ్ అయ్యారు. తనతో పాటే కాజల్ అగర్వాల్ కూడా కీలకసన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు స్పాట్ కి వెళ్లారని తెలుస్తోంది. పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. వేసవి కానుకగా రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అదీ సంగతి.

,  ,  ,  ,  ,