Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Dec-2015 18:09:41
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇప్పుడు మహా సంతోషంగా ఉంది. చేతిలో భారీ అవకాశాలు ఉండడం సంతోషం ఇచ్చేదే. అయితే భారీ చిత్రాలు చేతిలో ఉండడం అందులో నెంబర్ వన్ రేసులో ఉన్న ఇద్దరి చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు.

అసలు కెరీర్ డైలమాలో పడిందని అనుకున్న టైంలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబులు పిలిచి అవకాశమిచ్చారు. పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో లీడ్ హీరోయిన్ పాత్ర చేస్తున్న చందమామ.. మహేష్ మూవీ బ్రహ్మోత్సవంలో సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తోంది. సమంత మెయిన్ హీరోయిన్ గా చేస్తున్నా.. బ్రహ్మోత్సవంలో కాజల్ రోల్ చాలా కీలకమైనదిగా సమాచారం. ప్రస్తుతం బ్రహ్మోత్సవం యూనిట్ ఊటీలో షూటింగ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కాజల్ తో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఊటీలో వాతావరణం అంటే మామూలుగానే ఫుల్లు ఎనర్జీ ఇచ్చేస్తుంది. అలాంటిది మహేష్ లాంటి హ్యాండ్సమ్ హీరోతో కలిసి నటిస్తున్నపుడు ఆ ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ఇంత పట్టలేని ఆనందం అంటే.. అది ప్రతీ యాక్టివిటీలోనూ కనిపిస్తుంది కదా. అదే ఇలా కాజల్ ని గాల్లోకి ఎగిరేంత ఉత్సాహం ఇచ్చింది. అయితే.. ఏ ఫోటో అయినా.. తను ఎలా ఫోకస్ అవుతుందో మాత్రం కాజల్ కి బాగా తెలుసు. అందుకే అంత చక్కగా.. నాభి అందాలను బైటపెడుతూ ఫోటోకి గాల్లోనే ఫోజిచ్చింది.

,  ,  ,  ,