Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Feb-2016 16:25:47
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్ తన సినిమాలకి ఎలాంటి టైటిల్ పెట్టినా దాని గురించి కొన్నాళ్లపాటు చర్చ జరగాల్సిందే. కొత్తలో ఆయన సాఫ్ట్ టైటిల్స్ పెట్టారు. ఆ తర్వాత తిట్లనే టైటిళ్లుగా మార్చాడు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరమ్మాయిలతో - బిజినెస్ మేన్ అంటూ సాఫ్ట్ టైటిళ్ల వైపే మొగ్గు చూపాడు. ఇప్పుడు రీమిక్స్ అంటూ కొత్త పేరు వినిపిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కీ - ఎన్టీఆర్ కీ ఒకే రోజు రెండు కథలు చెప్పి ఒప్పించాడు పూరి. మొదట కళ్యాణ్ రామ్ సినిమానే సెట్స్ పైకి వెళుతుంది. ఆ చిత్రానికి రీమిక్స్ పేరు ఫిక్సయినట్టు తెలుస్తోంది.

ఇటీవలే పూరి టైటిల్ ని ఛాంబర్ లోనూ రిజిస్టర్ చేయించినట్టు తెలిసింది. ఈ టైటిల్ పెట్టడానికి బలమైన కారణం కూడా ఉందట. కళ్యాణ్ రామ్ కోసం పూరి తయారు చేసిన కథలో క్లాస్ అంశాలతో పాటు మాస్ అంశాలు కూడా ఉంటాయట. ఆ రెండింటినీ మేళవించిన కథ కాబట్టే రీమిక్స్ అనే పేరు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి రోగ్ అనే ఓ కన్నడ చిత్రం చేస్తున్నాడు. అది పూర్తవ్వగానే కళ్యాణ్ సినిమాని పట్టాలెక్కిస్తాడు. అది చివరి దశకు చేరుతుందో లేదో ఆ వెంటనే ఎన్టీఆర్ సినిమా మొదలవుతుంది.

,  ,  ,  ,