Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2017 10:14:03
facebook Twitter Googleplus
Photo

విడాకులకు సిద్ధమైంది తమిళ్ సూపర్ స్టార్ కుమార్తె. ఇరువురి సమ్మతితోనే విడాకులు తీసుకోవటానికి కోర్టును ఆశ్రయించింది రజనీకాంత్ కుమార్తె సౌందర్య. 2010లో అశ్విన్ తో సౌందర్య వివాహం జరిగింది. విడాకుల కోసం శుక్రవారం చెన్నైలోని ఫ్యామిలీకోర్టుకు హాజరైంది. ఈ దంపతులకు వేద్ అనే కుమారుడు ఉన్నాడు.

గడిచిన కొద్దికాలంగా వీరి మధ్య విభేదాలు ఉండటం.. కలిసి ఉండటం సాధ్యం కాదన్న విషయంపై స్పష్టత రావటంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబాల్లోనూ వీరి విడాకులకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది విడిపోవాలనుకుంటున్న వీరిద్దరిని కుటుంబ న్యాయస్థానం ఈ రోజు (శుక్రవారం) విచారించింది.

కోర్టులో విచారణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిందని.. దంపతులు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ఉమ్మడి అంగీకారంతో విడిపోతున్నట్ఉలగా జాయింట్ మెమోను దాఖలు చేయాలని వీరిని కోర్టు సూచించినట్లుగా చెబుతున్నారు. వీరు దాఖలు చేసే మెమోతో కోర్టు సంతృప్తి చెందితే వారికి విడాకులు మంజూరు చేస్తారని చెబుతున్నారు. పిల్లవాడి బాధ్యతల్ని ఎవరెలా పంచుకోనున్నది కోర్టుకు దంపతులు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,