Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 13:27:50
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు అక్టోబర్ 21న విడుదలవ్వబోతున్న ''ఇజం'' సినిమాపైనే ఇక మూవీ లవర్స్ అందరూ కన్నేశారు. ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుంది అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. చాన్నాళ్ళ తరువాత పూరి జగన్ సినిమాకు ఓ రేంజులో హైప్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద బజ్ వస్తుంది. అయితే ఈ సినిమా బిజినెస్ గురించి కొన్ని రూమర్లు మాత్రం వినిపిస్తున్నాయి.

నిజానికి కళ్యాణ్ రామ్ సొంతంగా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా బడ్జెట్ 26 కోట్లు అయ్యిందట. అయితే అదంతా చక్కగా క్యాష్ చేసుకుంటారు అనుకుంటే.. ''ఇజం'' సినిమా మాత్రం బయ్యర్ల నుండి కేవలం 20 కోట్లు తెచ్చుకుందట. అంటే తక్కిన 6 కోట్లు లాస్ అని కాదులే.. శాటిలైట్ వగైరా డబ్బులన్నీ ఉంటాయిగా. ఆ లెక్కన ఆ 6 కోట్లు కూడా వసూలు అయిపోయే ఛాన్సుంది. కాకపోతే కళ్యాణ్ రామ్ కు మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా అంత కలక్షన్ వస్తుందా అనేదే ట్రేడ్ వర్గాల సందేహం.

సర్లేండి.. అసలు రికవర్ అయితే ఏంటి? అవ్వకపోతే ఏంటి? ఎందుకంటే పూరి జగన్ బుజ్జిగాడు వంటి ఫ్లాపును తీసినా కూడా.. ఆ సినిమా దెబ్బతో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేట్ పూర్తిగా మారిపోలేదు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా అదే రకంగా ఎక్సపెక్ట్ చేయొచ్చు మరి.

,  ,  ,  ,  ,  ,