Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2017 12:06:49
facebook Twitter Googleplus
Photo

శ్రీముఖి ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ పై టాప్ ట్రెండింగ్ యాంకర్.. హోస్ట్ లలో శ్రీముఖి పేరు కూడా ఉంటుంది. మరోవైపు ఫిలిం ఈవెంట్స్ కు హోస్ట్ గా వ్యవహరించడంలో కూడా బోలెడంత ట్యాలెంట్ చూపించేసింది. ఇటు సిల్వర్ స్క్రీన్ పై కూడా సత్తా చాటేందుకు బాగానే ట్రై చేస్తోంది శ్రీముఖి.

ప్రేమ ఇష్క్ కాదల్ అంటూ నాలుగేళ్ల క్రితమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖికి ఇంకా సరైన బ్రేక్ మాత్రం చిక్కలేదు. చిన్న సినిమాల్లో చేసిన లీడ్ రోల్స్ అచ్చిరాలేదు. పెద్ద సినిమాల్లో చేసిన చిన్న పాత్రలు గుర్తింపు తెచ్చినా.. అవకాశాలు అందించలేకపోయాయి. టీవీ కెరీర్ బాగానే ఉన్నా.. సిల్వర్ స్క్రీన్ పై మెరవాలన్న అమ్మడి ఆలోచనలకు ఇప్పుడు పదును పెరిగింది. తాజాగా శ్రీముఖి కొత్త అందాలతో మెరిసిపోయింది. ఇప్పటివరకూ ఎక్స్ పోజింగ్ విషయంలో కొంత పొదుపు పాటించిన శ్రీముఖి.. ఇప్పుడు అడ్డుతెర ను తప్పించేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఎక్స్ పోజింగ్ విషయంలో మరీ టూమచ్ అయిపోలేదు కానీ.. కొంత వరకూ గ్లామర్ యాంగిల్ ను బయటకు తీసి ఓ ఫోటోసెషన్ చేసేసింది. చూడచక్కని మెరుపులతో మైమరపిస్తున్న శ్రీముఖి.. తాను ఏ హీరోయిన్ కూ తక్కువ కాదనే స్టేట్మెంట్ ని ఇన్ డైరెక్టుగా ఇచ్చేసింది. అందచందాల ప్రదర్శనతో ఆకట్టుకునేందుకు తనకేమీ అభ్యంతరాలు అంతగా లేవని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు.

,  ,  ,  ,  ,