Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2017 14:26:58
facebook Twitter Googleplus
Photo

వయసును ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారంలో బిజీగా పాల్గొంటూ బిజీ అయిపోతారు. ముఖ్యంగా ఒక గుర్తును చూపిస్తూ కనిపించిన వారికల్లా ఇదే గుర్తుకు ఓటేయాలని చెబుతుంటారు. ఇప్పుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా అదే తరహాలో తాను ఉన్న పార్టీ గుర్తు ట్యాప్ (పంపు)ని చూపిస్తూ ప్రచారాలను నిర్వహిస్తున్నాడు.

అదేంటి నందమూరి వారిది సైకిల్ గుర్తు కదా? అయినా ఎలక్షన్స్ కి ఇంకా చాలా సమయం ఉంది కదా అని అనుకున్నారా? అయన కనిపించింది నిజమే కానీ రియల్ గా కాదు. తెరపై ఎమ్మెల్యే గా గెలవడం కోసం. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఉపేంద్ర దర్శకత్వంలో ఎమ్ ఎల్ ఏ అనే సినిమా లో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సినిమా షూటింగ్ ప్రస్తుతం తెలంగాణలోని ఆదిలాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతోంది. రాజకీయ నేపథ్యంలో కథ ఉండడంతో సినిమా షూటింగ్ కోసం కళ్యాణ్ రామ్ అలా దర్శనం ఇచ్చాడు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. ట్యాప్ గుర్తుకు ఓటేయమంటున్నాడు.

సినిమాలో రాజకీయపరమైన సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయట. ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా అసలైన రాజకీయ ఎత్తుగడలను దర్శకుడు సినిమాలో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. దాదాపు తుది దశలో ఉన్న సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తవనుందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,