Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2017 14:59:51
facebook Twitter Googleplus
Photo

అడుగు బయటపెట్టిన దగ్గర నుంచి తమ ఖర్చులన్నీ నిర్మాతలో నిర్వాహకులో భరించాలనే సోకాల్డ్ సినీ జీవులకన్నా తాను చాలా భిన్నమంటున్నాడు పటాస్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.

లెజండరీ నటుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మే 28న అమెరికాలోని తానా వారు అమెరికాలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే రోజున ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ప్రారంభించడానికి కళ్యాణ్ రామ్ ను ఆహ్వానించారు. సాధారణంగా సెలబ్రిటీలను తమ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే అమెరికాకు రానుపోను ఛార్జీలు ఇతర ఖర్చులు తానాయే భరిస్తుంటుంది. ఇందుకోసం ఒక్కోరికి సుమారు పదివేల డాలర్ల వరకు ఖర్చు చేస్తుంది.

కళ్యాణ్ రామ్ కు సైతం ఇదే విధంగా ఆహ్వానం పంపగా... "తన ప్రయాణ ఖర్చులకు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదని... తన సొంత డబ్బులతోనే అమెరికాకు వస్తానని" చెప్పాడట. సైగా తనకోసం ఖర్చు పెడతామన్న డబ్బును అక్కడ చదువుకునే తెలుగు విద్యార్థుల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిందిగా కోరాడట.

,  ,  ,  ,  ,