Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2017 12:17:25
facebook Twitter Googleplus
Photo

అనసూయ.. ఈ పేరు టివి తెలుగు ప్రేక్షకులుకు పరిచయం చేయవలిసిన అవసరం లేదు. తెలుగు కామెడి షో జబర్దస్త్ లో హాట్ హాటు వాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అడపాదడపా కొన్ని సినిమాలు కూడా చేసింది. ఈ మధ్య బెంగళూరు నుండి హైదరాబాద్ కి వస్తున్నపుడు ఆమె కార్ ప్రమాదానికి గురియైంది.

బుదవారం నాడు అనంతపూర్ దగ్గరకి వచ్చినప్పుడు దారి లో వేరే వాహనం తో చిన్న ప్రమాదం జరిగింది. కార్ కు కొంచం ఎక్కువ డామేజ్ జరిగినా అనసూయకి అంతగా దెబ్బలు తగలకపోవడం అధృష్టం. ఇలాంటి టైమ్ లో కూడా రెస్ట్ తీసుకోకుండా సెట్ కు వచ్చి షో చేసింది అమ్మడు. అభిమానులు మిత్రులు ఫ్యామిలి సపోర్ట్ తో నేను బాగానే ఉన్న అంటూ తన ట్విటర్ లో అందరికీ నమస్కారం. మీ అభిమానానికి ప్రేమకు చాలా థాంక్స్. నేను ఇప్పుడు బాగున్నాను. రెస్ట్ తీసుకోవాలిసినంత దెబ్బలు ఏమి నాకు తగలలేదు. మనం షో లో కలుద్దాం అని ట్వీట్ చేసింది. ఆ షో కాస్ట్యూమ్ లో ఉన్న హాట్ ఫోటో పెట్టి అందరికీ కాస్త ఉపిరినిచ్చింది. ఇప్పుడు అనసూయ మరింత రెట్టింపు ఉత్తేజంతో కనిపిస్తుంది.

అనసూయ ఇప్పుడు టివి షో చేస్తూ సినిమాలు చేస్తూ ఇద్దరి పిల్లల తల్లిగా కమర్షియల్ గర్ల్ గా హాట్ హోస్ట్ గా మూడు పువ్వులు ఆరు కాయలు గా పచ్చగా సాగుతుంది.

,  ,  ,  ,  ,