Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2017 12:02:10
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ జనాలందరూ చూసి అబ్బురపడటానికి చాలా ముందే దాన్ని చూసేశాడు కీరవాణి తమ్ముడు.. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ రమణ. ఆ ట్రైలర్ చూసి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు. ట్రైలర్ చూసి తన గుండెలు అదిరిపోయాయని.. మైండ్ బ్లోయింగ్ అని అన్నాడు. తర్వాత ట్రైలర్ చూశాక జనాలకు కూడా దాదాపుగా ఇలాగే ఫీలింగే కలిగింది.

ఆ తర్వాత ఈ మధ్యే ది కంక్లూజన్ కు కీరవాణి చేసిన రీరికార్డింగ్ విన్నానని.. అది మామూలుగా లేదని.. అది చెవులకు విందే అని ఒక రివ్యూ ఇచ్చాడు కళ్యాణ రమణ. ఇప్పుడు మొత్తం సినిమా చూసేసిన కళ్యాణ రమణ.. సినిమా ఎలా ఉంది ఏంటన్నది మాట్లాడకుండా సింపుల్ గా ఒక జోస్యం చెప్పాడు. ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని.. ఇది పక్కా అని ఏప్రిల్ 28 ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని అన్నాడు కళ్యాణ రమణ.

కీరవాణి తమ్ముడి మాటలు చూస్తుంటే బాహుబలి: ది కంక్లూజన్ అంచనాలకు ఏమాత్రం తగ్గదనే అనిపిస్తోంది. ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని ఆల్రెడీ ట్రేడ్ వర్గాలు అంచనా కడుతున్నాయి.

,  ,  ,  ,  ,