Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2015 11:18:59
facebook Twitter Googleplus
Photo

కమలహాసన్ ... ప్రకాష్ రాజ్! ఇద్దరూ విలక్షణ నటులే... ఏ పాత్ర పోషించినా దానిపై తమ ముద్రను వేసే నటులే. ఇలాంటి ఇద్దరూ కలసి ఒక సినిమాలో నటిస్తే అది సూపర్ కదూ? ఆ ముచ్చట ప్రస్తుతం కమల్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రంలో చోటుచేసుకుంటోంది. కమల్ వద్ద ఎప్పటి నుంచో అసోసియేట్ గా ఉంటున్న రాజేష్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెలాఖరు నుంచి దీని షూటింగ్ హైదరాబాదులో నిర్వహిస్తారు.


కాగా, కమల్, ప్రకాష్ రాజ్ లపై ఈ రోజు చెన్నయ్ లో స్పెషల్ గా ఫొటో షూట్ నిర్వహించారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. "ఈ రోజు లెజండ్ కమలహాసన్ తో గడిచింది. మా సినిమా కోసం మా ఇద్దరిపైనా ఫొటో షూట్ చేశారు. ఈ సందర్భంగా ఎంతో సమయాన్ని కలసి గడిపాం. ఆ సమయంలో సాహిత్యం ... సినిమాలు .... జీవితం ... సంతోషం ... వంటి అంశాలపై ముచ్చటించుకున్నాం" అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశాడు.

,  ,  ,  ,  ,