Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2017 10:36:23
facebook Twitter Googleplus
Photo

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నటుడు సుధాకర్ కోమకుల ఇప్పుడు గ్రాండ్ ప్రాజెక్టులో హీరో గా రాబోతున్నాడు. నువ్వు తోపురా అనే పోస్టర్ ఈ మద్యనే విడుదలై అందరిలో ఆశక్తి రేపింది. ఇంగ్లీషులో చూసుకుంటే.. ఎన్.టి.ఆర్ అనే అక్షరాలతో ఈ సినిమా టైటిల్ ఫామ్ అవ్వడంతో ఆ మధ్యన కాస్త హడావుడి చేశారు. ఇప్పుడీ సినిమా టీజర్ విడుదలై గ్రాండ్ ప్రొడక్షన్ లుక్ తో పదునైన తెలంగాణ యాసతో సందడి చేస్తోంది.

సినిమా టీజర్ బట్టి చూస్తే సూరి అనే హైదరాబాద్ అబ్బాయి అమెరికా వెళ్ళి అక్కడ మాఫియాతో తలపడి అవకాశవాదిగా మారి అవసరాలకు తగట్టు క్రైమ్స్ చేస్తూ బతుకుతాడు. ఈ సినిమా టీజర్ లో చెవి మీద కొట్టేసి.. ఫియర్ త్రూ ఇయర్.. అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఇంకా అమెరికా బతుకు గురించి కూడా కొన్ని డైలాగ్లు హైలైటై మనకు కథ ఎటువంటిదో అర్ధం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. కాలర్ ఎగరేసే వాడికి డాలర్ సంపాదించటం కష్టం అని హీరో అన్నడంతో సినిమా ఒక థ్రిల్లర్ గా మన ఊహించుకోవచ్చు. ఎక్సపెక్ట్ చేయనీకి.. నేను తెలుగు సినిమా క్లయ్ మ్యాక్స్ ను కాను.. తెలంగాణ క్లయమేట్ ని అంటూ చివరి పంచ్ ఇచ్చేసి.. షూటింగ్ బిగినైంది అంటున్నారు. అసలు డౌటంటే.. టీజర్ రేంజులో మొత్తం చూపించేసి.. ట్రైలర్ లెవెల్లో కట్ చేసేసి.. ఇప్పుడేమో షూటింగ్ బిగిన్స్ అంటున్నారు. షూటింగ్ బిగినవ్వకుండానే ఇంత పెద్ద వీడియో తీశారా బాబులూ?

ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నది హరినాథ్ బాబు నిర్మాతగా చేస్తున్నది శ్రీకాంత్.

,  ,  ,  ,  ,  ,