Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2017 10:20:06
facebook Twitter Googleplus
Photo

కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ముందు దీని గురించి వార్త బయటికి వచ్చినపుడు చాలామంది జస్ట్ రూమరనే అనుున్నారు. కానీ ఆ తర్వాత కమల్ స్వయంగా తాను బిగ్ బాష్ షో చేస్తున్నట్లు కమల్ ప్రకటన చేశాక కానీ జనాలకు క్లారిటీ రాలేదు. ఐతే మరి ఐదు దశాబ్దాలుగా సినిమాల్లో కొనసాగుతూ.. ఏనాడూ బుల్లితెర వైపు చూడని కమల్ ఇప్పుడే ఎందుకు ఈ షో చేయడానికి ఒప్పుకున్నాడు.. ఆయన్ని అటువైపు పురిగొల్పింది ఏంటి.. ఈ ప్రశ్నలకు కమల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు. తాను డబ్బు కోసమే బిగ్ బాస్ షో చేయడానికి ఒప్పుకున్నట్లు కమల్ చెప్పడం విశేషం.

విజయ్ టీవీ వాళ్లు తనకు మంచి పే చెక్ ఇవ్వడానికి ముందుకొచ్చారని.. అలాగే ఎప్పుడూ సినిమాలకే పరిమితమైన తాను.. కొత్త ప్రేక్షకులకు చేరువ కావచ్చనే ఉద్దేశంతో బిగ్ బాష్ షో చేయడానికి అంగీకరించానని.. ఇక తనకు అభ్యంతరాలు ఏమిటని కమల్ అన్నాడు. ఈ సందర్భంగానే తాను పారితోషకం లేకుండా ఓ సినిమా కానీ.. మరే కార్యక్రమం కానీ చేయనని.. డబ్బు కోసమే తాను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నానని కమల్ అన్నాడు. కమల్ చేస్తున్న షోకు సంబంధించి ఇటీవలే విజయ్ టీవీ టీజర్ కూడా విడుదల చేసింది. ఆ టీజర్లో కమల్ లుక్.. ఆ ప్రోమోను కట్ చేసిన తీరు జనాల్ని ఆకట్టుకుంది.

,  ,  ,  ,  ,