Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 14:40:02
facebook Twitter Googleplus
Photo

ఒక్కో ప్రాంతానికి ఒక్కో నటుడు స్టార్ హీరోగా జనాలకు మెచ్చిన నటుడుగా స్టార్ గా గుర్తింపు పొందుతూ ఉంటారు. దేశం మొత్తం మీద అన్నీ బాషలులో నటించి అన్నీ చోట్ల ఒకే రకమైన గుర్తింపు తెచ్చుకొని విశ్వనటుడుగా పేరు సంపాదించాడు కమల్ హాసన్. బాలనటుడుగా నట జీవితం ఆరంభించి సినిమానే ఊపిరిగా బతికిన నిజమైన సినీమనిషి కమల్ హాసన్. కమల్ ఎంచుకున్న సినిమాలు కానీ చేసిన పాత్రలు కానీ మన దేశ సినీ చరిత్రలో గొప్ప మలుపుని తిప్పాయి. కథను ఎన్ని రకాలుగా కొత్తగా చెప్పాలో అన్నీ రకాలుగా ప్రయత్నం చేసి తనకు ఊపిరి ఉన్నంత వరకు ఇలానే ప్రయోగాలు చేస్తానుని చెప్పిన కమల్ తనకు బాగ నచ్చిన తన జీవితంలో ప్రభావం చూపిన 70 సినిమాలను ఒక లిస్ట్ చేసి చెబుతున్నాడు.

కమల్ సినిమా చేస్తూ సినిమాను చూస్తూ గొప్ప మహా మేధావలులైన డైరెక్టర్లు తో పని చేస్తూ సినిమా బాషను నేర్చుకున్నాను అని చెబుతూ కొన్ని సినిమాలును ఇలా ప్రస్తావించాడు. దేశంలో ఉన్న ఇండస్ట్రిలోని మేటి చిత్రాలను తెలుపుతూ మన తెలుగులో కొన్ని గొప్ప సినిమాలను చూడమని ఇలాంటి సినిమాలు వలన మన జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది అని చెబుతున్నాడు. దేవదాసు - మాయబజార్ - మనవూరు పాండవులు - శంకరాభరణం - సాగరసంగమం - మరో చరిత్ర - మనం - దంగల్ - దశావతారం - విశ్వరూపం లాంటి తెలుగు సినిమాలు అతను లిస్ట్ లో ఉన్నాయి. అంతే కాకుండా హిందీలో గొప్ప సినిమాలైన ‘మొఘల్ ఏ ఆజమ్’ గురు దత్త్ డైరెక్ట్ చేసిన ‘కాగజ్ కా పూల్’ అలానే బెంగాలీ డైరెక్టర్ సత్యజిత్ రే సినిమాలు కూడా కమల్ గొప్ప సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి.

ఈ లిస్ట్ గురించి చెబుతూ “ నేను చూసిన మన దేశ సినిమాలలో గొప్పవిగా అనిపించే సినిమాలను లిస్ట్ లో పెట్టాను. ఇవి ఏమి మీరు తప్పకుండా చూడవలిసిన సినిమాలు అని నేను అనుకోవటం లేదు. నా జీవితంలో ఈ సినిమాలు ముఖ్య పాత్ర పోషించాయి. కొన్ని నా జీవితాన్ని మార్చిన సినిమాలు కూడా ఉన్నాయి. నేను ఇవి చూడమని ఏమి మీకు సలహా ఇవ్వటంలేదు. ఎందుకంటే ఈ సినిమాలు ద్వారా నేను ఏమి పొందానో అది మీరు పొందలేకపోవచ్చు. మనం దేనితో ప్రేమలో పడతామో ఎప్పుడు పడతామో ఎవరికి తెలియదు.

,  ,  ,  ,  ,  ,